PoliticalSiddipetaTelangana

డాక్యుమెంటరీ రైటర్ అనుమానాస్పద మృ*తి

డాక్యుమెంటరీ రైటర్ అనుమానాస్పద మృ*తి

డాక్యుమెంటరీ రైటర్ అనుమానాస్పద మృ*తి

web desc : సిద్దిపేట జిల్లా వర్గల్‌లో డాక్యుమెంటరీ రైటర్‌గా పనిచేస్తున్న గుంటిపల్లి గ్రామానికి చెందిన బడిగె వీరగౌడ్ (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గౌరారం ఏఎస్ఐ పోచ గౌడ్ తెలిపారు. ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లిన వీరగౌడ్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, 17న ఉదయం వర్గల్‌లోని తన షాప్‌లో మృతదేహంగా కనిపించారు.

మృతి చెందే ముందు వాంతులు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.

వీరగౌడ్‌కు ఐదేళ్లలోపు ఇద్దరు చిన్న కూతుళ్లు ఉండటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చిన్నారులు తండ్రిని కోల్పోవడంతో గుంటిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button