HyderabadPoliticalTelangana

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి బైఠాయింపు!

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి బైఠాయింపు!

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి బైఠాయింపు! ‘ఆరేళ్లు ప్రేమించి ఇప్పుడు మోసం చేస్తావా?’..

web desc : ఒకే కాలనీకి చెందిన యువతి, యువకుడి మధ్య ఆరేళ్లుగా సాగుతున్న ప్రేమ వ్యవహారం వివాదంగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ యువతి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది.

యువతీ తెలిపిన వివరాల ప్రకారం.. మెట్‌పల్లి పట్టణంలోని ఏకలవ్య నగర్‌కు చెందిన అంగడి శిరీష అదే కాలనీకి చెందిన పాలకుర్తి సతీష్ అనే యువకుడు గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారని యువతి తెలిపింది.

గల్ఫ్ వెళ్లి వచ్చాక పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనకు వచ్చిన సంబంధాలను కూడా వద్దని చెప్పించాడని, ఇప్పుడు మాట మార్చి పెళ్లి చేసుకోనని, వేరే పెళ్లి చేసుకోమని, తాను అలాగే ఉంటానని అంటున్నాడని యువతి ఆరోపిస్తోంది.

మా నాన్న నాతో నిన్ను పెళ్లిచేసుకోవద్దని ప్రమాణం చేయించాడని, ఇప్పుడు మన ఇద్దరికీ వరుస కూడా కుదరదంటూ సాకులు చెబుతున్నాడని ఆమె వాపోయింది. దీంతో శనివారం నుంచి ప్రియుడి ఇంటి ముందు ఆమె బైఠాయించింది. ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు యువతి తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button