HyderabadPoliticalTelangana

కానిస్టేబుల్ ను బలిగొన్న పర్సనల్ లోన్ తిప్పలు... EMIలు కట్టలేక..

కానిస్టేబుల్ ను బలిగొన్న పర్సనల్ లోన్ తిప్పలు... EMIలు కట్టలేక..

కానిస్టేబుల్ ను బలిగొన్న పర్సనల్ లోన్ తిప్పలు… EMIలు కట్టలేక..

Web desc : తీసుకున్న పర్సనల్ లోన్‌ను సకాలంలో కట్టలేక ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పవన్ కుమార్(30) సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

భార్య, కూతురు, కుమారుడితో కలిసి 3 నెలలుగా బోరబండ ఠాణా పరిధిలోని ఇందిరానగర్ లో నివసిస్తున్నాడు. కాగా, వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న పర్సనల్ లోన్‌ ను తిరిగి చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.

ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున బాత్‌రూమ్‌లోకి వెళ్లి, బయటకు రాలేదు. భార్యకు అనుమానం వచ్చి, కుటుంబసభ్యులతో కలిసి డోర్​ను తొలగించి చూడగా.. పవన్ కుమార్ షవర్‌కు లుంగీతో ఉరేసుకొని కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button