
కోరిక తీర్చలేదని కత్తితో దాడి.. మహిళను 9 చోట్ల పొడిచి పారిపోయిన కామాందుడు!
Web desc : తనతో ఏకాంతంగా కలిసేందుకు నిరాకరించిందనే కోపం ఓ వ్యక్తి మహిళపై కత్తితో దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో పనిచేసే కర్నూలు జిల్లాకు చెందిన కొప్పుల శ్రీనివాసరావు అనే వ్యక్తి నెల రోజుల క్రితం ఒక బిర్యానీ పాయింట్‌లో పనిచేసే మల్లేశ్వరితో పరిచయం ఏర్పడింది.
అప్పటి నుండి ఇద్దరూ రోజూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇదే అదునుగా భావించిన శ్రీనివాసరావు ఆమెను లైంగికంగా వేధించడం స్టార్ట్ చేశాడు. తనతో శారీరక సంబంధాన్ని కొనసాగించాలని వెంటపడ్డాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
అయితే తన మాట వినని మల్లేశ్వరి పట్ల శ్రీనివాసరావు కక్ష పెంచుకున్నాడు. తనను దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. ఎలాగైనా ఆమెపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక ప్లాన్ ప్రకారం.. శుక్రవారం రాత్రి ఆమె ఇంట్లో ఉన్న సంగతి తెలుసుకున్నాడు. జేబులో చాకు పెట్టుకొని ఆమె ఇంటి వద్దకు వెళ్లి తలుపు తీసి లోపలికి వెళ్లాడు.
ఆమె ఒంటరిగా కనిపించే సరికి జేబులోని కత్తితీసి ఆమెపై 9 చోట్ల దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన మల్లేశ్వరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
చిలకలూరిపేట నుండి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతుంది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు.




