PoliticalTelangana

లక్షన్నర లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పబ్లిక్ ప్రాసిక్యూటర్...

లక్షన్నర లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పబ్లిక్ ప్రాసిక్యూటర్...

లక్షన్నర లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పబ్లిక్ ప్రాసిక్యూటర్…

Web desc : పెద్దపల్లి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) డొంకెన రవీందర్ ఏసీబీ వలకు దొరికిపోయాడు. పెద్దపల్లి జిల్లా కోర్టు పీపీ రవీందర్ రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికాడు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ఈ లంచగొండి పీపీని పక్కా ప్లాన్తో పట్టుకున్నారు. నిందితుడు డొంకెన రవీందర్ సొంతూరు కునారం.

పీపీ రవీందర్ను ఏసీబీ అధికారుల అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఏసీబీ అధికారులు పీపీ రవీందర్ను కరీంనగర్ తీసుకువెళ్లారు. నంది మేడారం కోర్టులో ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఏసీబీ అధికారులు డొంకెన రవీందర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు.

ఈ వ్యవహారానికి సంబంధించి లంచం డిమాండ్ వెనుక ఉన్న కారణాలు, కేసుతో ఆయనకున్న సంబంధం, ఇతర వివరాలపై అధికారులు విచారిస్తున్నారు. న్యాయస్థానాల్లో బాధితులకు న్యాయం అందించడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర అత్యంత కీలకం. ప్రభుత్వం తరఫున న్యాయవాదులుగా వ్యవహరిస్తూ న్యాయ ప్రక్రియ సక్రమంగా సాగేందుకు వారు బాధ్యత వహిస్తారు.

అలాంటి కీలక పదవిలో ఉన్న వ్యక్తిపై లంచం ఆరోపణలు రావడం న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనంపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాల పరిధిలో లంచం డిమాండ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button