EducationHyderabadNotificationPoliticalTelangana

ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ…

ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ…

హైదరాబాద్‌: రాష్ట్రంలో 275 ఎస్‌ఐ (సివిల్‌), తత్సమాన స్థాయి పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ రాత పరీక్ష ఈ నెల 29న జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 335 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి (టీజీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు.

మొత్తం 1,60,712 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్టు తెలిపారు. ఈ నెల 22 ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు www.tgprb.in ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించారు. ఏవైనా సాంకేతిక సమస్యలతో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ కాకపోతే support@tslprb.in కు ఈ-మెయిల్‌ చేయాలని, లేదా 040-41895151 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.
అభ్యర్థులకు కీలక సూచనలు

హాల్‌టికెట్‌ను ఏ4 సైజు పేపర్‌పై ప్రింట్‌ తీసుకోవాలి. వీలైతే రెండు వైపులా ప్రింట్‌ చేయాలి.

దరఖాస్తు సమయంలో అప్‌లోడ్‌ చేసిన పాస్‌పోర్టు సైజు ఫొటోను హాల్‌టికెట్‌ మొదటి పేజీలో కేటాయించిన ప్రదేశంలో గమ్‌తో అతికించాలి. ఫొటో అతికించని హాల్‌టికెట్‌తో పరీక్షకు అనుమతించరు.

పరీక్ష ప్రారంభానికి గంట ముందు నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోరు.

పరీక్ష సమయంలో అభ్యర్థుల డిజిటల్‌ ఫొటో, వేలిముద్రలు, సంతకాలను సేకరించడంతోపాటు ఆధార్‌ ఆధారిత ఫేషియల్‌ అథెంటికేషన్‌ నిర్వహిస్తారు.

అందువల్ల బయోమెట్రిక్‌ వివరాల నమోదుకు ఆటంకం కలగకుండా చేతులకు మెహందీ, తాత్కాలిక టాటూలు లేదా ఇతర అడ్డంకులు కలిగించే పదార్థాలు పెట్టుకోవద్దు. అనువాదంలో అక్షర దోషం ఉంటే.. ఇంగ్లిష్‌ వెర్షనే తుది ఎంపిక
ప్రిలిమినరీ పరీక్షలో తప్పు సమాధానాలకు నెగెటివ్‌ మార్కులు ఉంటాయని బోర్డు స్పష్టం చేసింది. ప్రశ్నపత్రం ఇంగ్లి‹Ù-తెలుగు, ఇంగ్లి‹Ù-ఉర్దూ భాషల్లో ఉంటుంది.

అనువాదంలో ఏదైనా సందిగ్ధత లేదా అక్షర దోషం ఉంటే ఇంగ్లిష్‌ వెర్షన్‌నే తుది, సరైన ప్రశ్నగా పరిగణిస్తామని తెలిపింది. ఓఎంఆర్‌ జవాబు పత్రంపై అనవసరమైన రాతలు, గుర్తులు, మతపరమైన చిహ‍్నాలు, ప్రార్థనలు లేదా గుర్తింపు చిహ్నాలు రాస్తే ఆ పత్రాన్ని మూల్యాంకనం చేయబోమని హెచ్చరించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button