
SSC నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 320 పోస్టులు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) గ్రేడ్-‘సి’ స్టెనోగ్రాఫర్స్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (ఎల్డీసీఈ)- 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు సర్వీసులు, కేడర్లలో మొత్తం 320 ఖాళీల భర్తీ చేయనున్నారు.
పోస్టు పేరు: స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ – సి.
మొత్తం ఖాళీలు: 320.
విభాగాల వారీగా ఖాళీలు: సెంట్రల్ సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ (డీఓపీటీ) 287, రైల్వే బోర్డ్ సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ 8, ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ 14, ఇండియన్ ఫారెన్ సర్వీస్ బ్రాంచ్ (బి) స్టెనోగ్రాఫర్స్ 8, ఎలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టెనోగ్రాఫర్ సర్వీస్ 1, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 2. సర్వీసు అర్హత: ఆరు సర్వీసులు/ కేడర్లలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-‘డి’ ఉద్యోగులుగా రెగ్యులర్ సర్వీసులో ఉన్నవారు మాత్రమే అర్హులు.
వయోపరిమితి: ఎల్డీసీఈ నోటిఫికేషన్లో అన్ని కేడర్లకు కలిపి ఉమ్మడి కనీస/ గరిష్ట వయోపరిమితి లేదు. అభ్యర్థులు తమ విభాగానికి వర్తించే నిబంధనలు, సర్వీసు అర్హతలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా లాస్ట్ డేట్: డిసెంబర్ 8.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్: 2027, ఫిబ్రవరి – మార్చి (తాత్కాలికం).
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ ssc.gov.inను సందర్శించండి.




