ఫిబ్రవరి 10న వేలాది మంది వికలాంగులతో ఛలో ఢిల్లీ-వికలాంగుల మహాధర్నా కార్యక్రమం

కేంద్ర బడ్జెట్లో దివ్యాంగులకు ఐదు శాతం నిధులు కేటాయించాలి.;

By :  Admin
Update: 2025-02-08 05:12 GMT

ఫిబ్రవరి 10న వేలాది మంది వికలాంగులతో ఛలో ఢిల్లీ-వికలాంగుల మహాధర్నా కార్యక్రమం

రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జేర్కొని రాజు ఆధ్వర్యంలో

చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలి వెళ్లిన ఎన్పి ఆర్డి సభ్యులు

కేంద్రం 300 నుండి 5 వేలకు పెన్షన్ పెంచాలి.

అర్హులైన దివ్యాంగులకు అంత్యోదయ రేషన్ కార్డులు అందజేయాలి.

కేంద్ర బడ్జెట్లో దివ్యాంగులకు ఐదు శాతం నిధులు కేటాయించాలి.

సి కే న్యూస్ షాద్ నగర్ :ఫిబ్రవరి 7

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 300 నుండి 500 వరకు దివ్యాంగులకు పెన్షన్ పెంపొందించాలని డిమాండ్ చేస్తూ ... వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆడి వయ్య ఆదేశానుసారం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జేర్కొని రాజు చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలి వెళ్లారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కనీస పెన్షన్ రూ.300 నుండి 5000 లకు పెంచాలని, ప్రతి వికలాంగునికి అంత్యోదయ రేషన్ కార్డు, ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఇచ్చి 200 రోజులు పని దినాలు కల్పించాలని ఎన్ పి ఆర్ డి కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న వేలాది మంది వికలాంగులతో ఛలో ఢిల్లీ-వికలాంగుల మహాధర్నా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ఛలో ఢిల్లీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి 1000 మంది వికలాంగులు హాజరు అవుతున్నారు.దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2.68 కోట్ల మంది వికలాంగులున్నారు. డబ్ల్యుహెచ్ఎ లెక్కల ప్రకారం 16శాతం మంది వికలాంగులు ఉన్నారు. 2011నుండి పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం 300 రూపాయలు మాత్రమే చేల్లిస్తుంది. నిత్యావసర సరకుల ధరలు 300 రేట్లు పెరిగినవి. కానీ పెన్షన్స్ మాత్రం పెంచకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ధరల పెరుగుదల సూచికి పెన్షన్స్ అనుసంధానం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ స్కీమ్ వికలాంగులందరికి వర్తింపచేయాలి. రాజస్థాన్ రాష్ట్రం మాదిరిగా పెన్షన్ పొందడం వికలాంగుల హక్కుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలి. 2015 డిసెంబర్ 3న ఆర్భాటంగా ప్రధాన మంత్రి ప్రారంభించిన సుగమ్య భారత్ అభియాన్ పథకం అమలు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఫలితంగా 2024 సంవత్సరం పూర్తి అవుతున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. కేంద్ర ప్రభుత్వం అసమర్ధత వలన 2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, 2017 మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్, 2007 ఐక్య రాజ్యా సమితి హక్కుల ఒప్పంద పత్రం,నేషనల్ పాలసీ, నేషనల్ ట్రస్ట్ వంటి కీలక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. 2016 ఆర్పిడి చట్టానికి సవరణ చేయడానికి విడుదల చేసిన గెజిట్న రద్దు చేయాలి. 2016 ఆర్పిడి చీఫ్ కమిషనర్, నేషనల్ ట్రస్ట్కు 10 ఏండ్ల నుండి చైర్మన్స్ నియమించడం లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ అందని ద్రాక్షగా మారుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటికరణ వలన వికలాంగులు రిజర్వేషన్ సౌకర్యం కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది.

న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని ఎన్పిఆర్డి డిమాండ్.

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ వాటా 300 రూపాయలను 5000లకు పెంచాలి. ధరల పెరుగుదల సూచికి పెన్షన్స్ అనుసంధానం చేయాలి,ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పథకాన్ని వికలాంగులందరికి వర్తింప చేయాలి,రాజస్థాన్ రాష్ట్రం మాదిరిగా పెన్షన్ పొందడం వికలాంగుల హక్కుగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పొందడం వికలాంగుల హక్కుగా చట్టాన్ని చేయాలి. ప్రతి ఏటా 15 శాతం పెన్షన్ పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి,ఉపాధి హామీ పథకంలో వికలాంగులు చేయడానికి అనువుగా ఉన్న పనులను గుర్తించి పని కల్పించాలి. దరఖాస్తూ చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇచ్చి 200 రోజులు పని కల్పించాలి,ఆ వివాహంతో సంబంధం లేకుండా వికలాంగులకు అంత్యోదయ అన్న యోజన కార్డులు జారీ చేయాలి,అన్ని రకాల రైలులలో వికలాంగుల ప్రయాణ రాయితీ సౌకర్యాన్ని పునరుద్దరించాలి,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులు రాయితీలను పొందేందుకు యుడిఐడి కార్డునే గుర్తింపుగా పరిగణించాలి,బడ్జెట్లో వికలాంగుల సంక్షేమనికి 5శాతం నిధులు కేటాయించాలి, వికలాంగుల విద్యా అభివృద్ధి కోసం తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల మాదిరిగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విద్యా పాలసి చేయాలి,సకలాంగుల క్రీడాకారులతో సమానంగా వికలాంగుల క్రీడాకారులను ప్రోత్సహించాలి. పారా క్రీడాలను అభివృద్ధి చేయాలి,కేంద్ర ప్రభుత్వ శాఖలాన్ని వికలాంగుల సంక్షేమనికి 5శాతం నిధులు కేటాయించి, ఖర్చు చేయాలి. నామినేటెడ్ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలి.2016 ఆర్పిడి చట్టంతో పాటు ఇతర వికలాంగుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. 2016 ఆర్పిడి చట్టం చీఫ్ కమిషనర్, నేషనల్ ట్రస్టుకు చైర్మన్ లను వెంటనే నియమించాలని పలు రకాల డిమాండ్లతో ఈ నెల 10న ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద భారీ బహిరంగ సభ తో తమ డిమాండ్లను వ్యక్తపరుస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు

Similar News