నేడు రైతు ఖాతాలలో నగదు
పీఎం కిసాన్ నిధులు నేడు విడుదల కానున్నాయి. బిహార్ భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 19వ విడత కింద రూ.22 వేల కోట్లు నిధులను విడుదల చేస్తారు.
రైతన్నలకు ఏడాదిలో ఒక్కో విడత రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో మొత్తం రూ.6 వేల సాయం అందించే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఇప్పటివరకు 11 కోట్ల మంది అన్నదాతలకు 18 వాయిదాల్లో రూ.3.46 లక్షల కోట్లను చెల్లించారు. ఈ పథకం ద్వారా మొత్తం 18 విడతల్లో తెలంగాణలో 30,77,426 మంది రైతన్నలకు రూ.627 కోట్లు చెల్లించారు.