వివాదంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా?
వివాదంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా?;
వివాదంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా?
దేశ రాజధాని ఢిల్లీలో విపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), పాలక బీజేపీ మధ్య తాజాగా ఫొటోల యుద్ధం మొదలైంది. ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ
నేతలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను సీఎం రేఖా గుప్తా అవమానించారని ఆరోపిస్తున్నారు.
ఇంతకీ ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం జరిగింది? ఢిల్లీ సీఎం కార్యాలయంలో బీజేపీ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులైన అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోల్ని తొలగించిందని, ఆ ఫొటోల స్థానంలో మహాత్మా గాంధీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలను ఉంచినట్లు ఆప్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఆప్‌నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషీ మర్లేనా ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫొటోల్ని పోస్ట్ చేశారు.
ఆ సోషల్ మీడియా పోస్ట్‌లో తాను సీఎంగా ఉన్న సమయంలో అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు ఉన్నాయని, నూతన సీఎంగా బాధత్యలు చేపట్టిన రేఖాగుప్తా ఆ ఫొటోల్ని తొలగించి వాటి స్థానంలో రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు పెట్టారని పేర్కొన్నారు.