మనిషిని చంపడం చెట్లను నరకడం, నేరం...

మనిషిని చంపడం చెట్లను నరకడం, నేరం...;

By :  Ck News Tv
Update: 2025-03-28 07:06 GMT

మనిషిని చంపడం చెట్లను నరకడం, నేరం...

సుప్రీంకోర్టు తీర్పు, సంతోషకరం

మార్చి 27 (సి కే న్యూస్) చేగుంట

చెట్లను నరకడం మనుషుల్ని చంపడం సమానం అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం చాలా సంతోషకరం మరి,అలానే ప్రభుత్వం రోడ్ల ఇరువైపులా కరెంటు స్తంభాల కింద చెట్లు నాటడం వాటిని తిరిగి నరకడం ఇదే పనిగా ప్రతి సంవత్సరము జరుగుతుంది

మరి ఈ విషయంలో ప్రభుత్వ ఉన్నంత అధికారులకు ఆలోచన లేని తనమా ఆలోచన ఉన్నతనమా... ఇది దేనికి నిదర్శనం రోడ్డుకు ఇరువైపుల చెట్లు నాటడం మంచిదే కానీ వాటి పైన కరెంటు తీగలు కరెంటు స్తంభాలు దీని కథ ఏంది ఈ కరెంటు స్తంభాలను రోడ్డుకు పక్కనే నాటడం వాటి కింద చెట్లు నాటడం తిరిగి చెట్లను నరకడం ఇదే పనిగా జరుగుతుంది

Full View

నా ముఖ్య ఉద్దేశం సలహా రోడ్డు అంచు చివరి నుండి 50 అడుగుల దూరంలో కరెంటు స్తంభాలు ఉండాలి రోడ్డు అంచున కరెంటు స్తంభాలు ఉండకూడదు ఈ విధంగా రోడ్డు ఇరువైపులా చెట్లు నాటడంతో చెట్లకు ఎలాంటి ప్రమాదం ఉండదు నరకడం జరగదు

కావున ఇ సలహాను ప్రభుత్వ ఉన్నంత అధికారులు గుర్తించాలని నేను కోరుతున్నాను మీరు ఏ విధంగా స్పందిస్తారో నాకు తెలియదు కానీ నష్టం జరగకూడదు అంటే ఈ సలహా పాటించక తప్పదు అనే నేను ప్రభుత్వ ఉన్నత అధికారులకు తెలియజేసుకుంటున్నాను...

సామాజిక ఉద్యమ నమస్కారాలతొ... మీ... కొలుపుల రామస్వామి మాదిగ ఎమ్మార్పీఎస్ చేగుంట మండల అధ్యక్షులు

Similar News