నీ పదవి కోసమే పైసలు ఇచ్చావ్‌'..

మల్లారెడ్డిపై కాంగ్రెస్‌ నాయకుల ధ్వజం;

By :  Ck News Tv
Update: 2025-03-03 05:22 GMT

నీ పదవి కోసమే పైసలు ఇచ్చావ్‌'..

మల్లారెడ్డిపై కాంగ్రెస్‌ నాయకుల ధ్వజం

'పైసలు ఎందుకిచ్చావ్‌…పైసలు ఇయ్యాల్సిన అవసరం ఏముంది…నీ పదవి కోసమే పైసలు ఇచ్చావ్‌’.. అంటూ మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లారెడ్డిని అదే మండలానికి చెందిన సీనియర్‌ నాయకుడు లద్దిపీర్ల శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. ఆదివారం గజ్వేల్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవి కోసం ఇచ్చావా… వ్యక్తిగతంగా ఇచ్చావా నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు.

నర్సారెడ్డిని విమర్శించే స్థాయి మల్లారెడ్డికి లేదన్నారు. అంతకు ముందు గజ్వేల్‌ ఏఎంసీ చైర్మన్‌ వంటేరు నరేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సర్ధార్‌ఖాన్‌, కాంగ్రెస్‌ కొండపాక మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నుండి తరిమేస్తే కాంగ్రెస్‌లో చేరిన నాయిని యాదగిరికి రాజకీయ భిక్షపెట్టిన తూంకుంట నర్సారెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్‌ పదవుల కోసం పాకులాడుతున్న నాయకులు గత చరిత్రను తెలుసుకోవాలని హితవు పలికారు.

2014 మున్సిపల్‌ ఎన్నికల బాధ్యతలను యాదగిరికి అప్పగిస్తే ఎవరిని ఎదగనీయకుండా పార్టీని భ్రష్టు పట్టించాడని విమర్శించారు. బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తూ పార్టీకి యాదగిరి చెడ్డపేరు తెచ్చారన్నారు. నర్సారెడ్డి నామినేటెడ్‌ పదవులను డబ్బులకు అమ్ముకుంటున్నట్లు చేస్తున్న దుష్ప్రచారాన్ని వారు ఖండించారు. ఏఎంసీ చైర్మన్‌ పదవిస్తే రూ.15లక్షలు ఇస్తామని మంత్రికి చెప్పొచ్చిన దొంగలు మీరే అని విమర్శించారు. నామినేటెడ్‌ పదవులు ఇప్పించడంలో నర్సారెడ్డికి తాము ఎలాంటి పైసలు ఇవ్వలేదని ఈ సందర్భంగా వేంకటేశ్వరస్వామి ఫొటోపై వారు ప్రమాణం చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Similar News