కొత్త రేషన్ కార్డులకు బ్రేక్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు బ్రేక్.. ఈసీ సంచలన ఆదేశాలు;

By :  Admin
Update: 2025-02-08 13:11 GMT

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు బ్రేక్.. ఈసీ సంచలన ఆదేశాలు

తెలంగాణ(Telangana)లో కొత్త రేషన్ కార్డు(New Ration Cards)లకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే శనివారం ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులు, మార్పులు, చేర్పుల దరఖాస్తు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఏడాదిగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రభుత్వం శుక్రవారం గుడ్ న్యూస్ తెలిపింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గత నెల 26న గ్రామ సభల్లో దరఖాస్తు చేయని వారు కూడా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అటు పౌరసరఫరాల శాఖ సైతం ప్రకటించింది. ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగి కుటుంబ సభ్యుల పేర్లలో మార్పులు, చేర్పులు, చిరునామా వంటి వాటికి వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మీసేవా కేంద్రాల్లో కొత్త ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల స్వీకరణను వెంటనే ప్రారంభిచాలని మరోవైపు ప్రభుత్వం కూడా ఆదేశించింది. దీంతో రేషన్ కార్డులు లేని పేదలు మీ కేంద్రాలకు వెళ్లారు. అయితే వారికి అక్కడ నిరాశ మిగిలింది. దరఖాస్తులు స్వీకరించడంలేదు. మీ సేవా సెంటర్లలో కొత్త రేషన్ కార్డుల పోర్టల్ ఓపెన్ కాలేదు. ఎందుకనే విషయం మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు సైతం సమాచారం లేదు. తాజాగా ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఆదేశాలతోనే రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాలేదనే విషయంపై స్పష్టత వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు ఈసీ బేక్ వేసినట్లు తెలిసిపోయింది.

Similar News