PoliticalTelanganaUncategorized

ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడిన మణుగూరు తహసీల్దార్ రాఘవరెడ్డి..

ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడిన మణుగూరు తహసీల్దార్ రాఘవరెడ్డి..

ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడిన మణుగూరు తహసీల్దార్ రాఘవరెడ్డి..

కొందరు వ్యక్తులు మీద మీదకు వచ్చి బెదిరించిన బయపడని తహసీల్దార్..

కొడితే కొట్టండి.. చంపితే చంపండి అంతేగాని ప్రభుత్వ భూమికి పెన్షింగ్ మాత్రం ఆపను..

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

ఫిబ్రవరి 09,

మణుగూరు మండలం రాజీవ్ గాంధీనగర్ ఏరియాలో సర్వే నెం.138లో ప్రభుత్వ భూమి కబ్జాకి గురైతే ఆ ప్రభుత్వ భూమిని కాపాడటానికి వచ్చిన మణుగూరు తహసీల్దార్ రాఘవరెడ్డి పై కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు.

ఈ క్రమంలో తహసీల్దార్ నా కోసమా..నా ఇంటి నిర్మాణ కోసమా అంటూ వారితో మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని కబ్జాలో నుంచి కాపాడారు.

ప్రభుత్వ భూమిని అక్కడ ఉన్న కొందరు గిరిజనేతరు లు కబ్జా చేసి అమ్మకాలు చేశారని తెలుస్తుంది. ఎవరు అడ్డువచ్చిన సరే పెన్షింగ్ మాత్రం ఆపేదిలేదంటు ప్రభుత్వ ఆస్తిని కాపాడిన తహసీల్దార్ రాఘవరెడ్డి.

తహసీల్దార్ కు జిల్లా కలెక్టర్ అభినందన..

ప్రభుత్వ భూముల జోలికి వస్తే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించకండని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తహసీల్దార్ రాఘవరెడ్డికి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అలాగే ప్రభుత్వ ఆస్తి కోసం పోరాడుతున్న తీరును చూసి జిల్లా కలెక్టర్ తహసీల్దార్ ను అభినందించినట్టు వినిపిస్తోంది..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button