PoliticalTelangana

మత్తు వీడు పనిముట్టు పట్టు…

మత్తు వీడు పనిముట్టు పట్టు

మేలుకో యువతరమా..! గ్రామాల్లో గుడుంబా నిషేధానికి శ్రీకారం, శభాష్ పోలీస్ అన్న

“మత్తు వీడు పనిముట్టు పట్టు”

“గుడుంబా దాటికి రోడ్డున పడుతున్న మధ్యతరగతి కుటుంబాలు”

“సామాజిక ప్రజాస్వామ్యాన్ని పెంపొందించేందుకు పోలీసే కానక్కర్లేదు బాధ్యతగల పౌరుడైతే చాలు,”

“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్”

ములుగు జిల్లా లోని మారుమూల గిరిజన ప్రాంతాలలో గుడుంబాచే మానసికంగా, శారీరికంగా, బాధింపబడుతున్న. మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని, వెంకటాపురం మండల పోలీస్ శాఖ చొరవతో తీసుకున్న కీలక నిర్ణయమే” గుడుంబా నిషేధం,

ఈ రోజు అనగా శనివారం ఉదయం బెస్త గూడెం గ్రామపంచాయతీ పరిధిలో ప్రజలు మరియు ప్రజా ప్రతినిధులతో అనగా, గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ పెద్దలు మరియు రైతులు యువత సమక్షంలో కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహించడమైనది.

ఇందులో ప్రధానంగా బెస్త గూడెం గ్రామంలో గుడుంబా తయారీ అమ్మకం ను నిర్మూలించడానికి తీసుకోవలసిన చర్యలను గురించి గ్రామస్తులతో చర్చించడం జరిగినది. గ్రామంలో ఉన్న ప్రతి యువకుడు ఒక యూనిఫామ్ లేని పోలీసుగా గ్రామంలోని గుడుంబా నిర్మూలన సహకరించవలసిందిగా గ్రామ యువతను కోరడమైనది,

అదే విధంగా గ్రామంలోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిందిగా గ్రామస్తులను కోరడమైనది గ్రామలలో జరిగే కోడిపందాలు పేకాట ఇతర కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు పోలీసువారికి సమాచారం అందించవలసిందిగా పోలీసు వారి ఫోన్ నెంబర్లను గ్రామస్తులకు ఇవ్వడం అయినది.

ఈ క్రమంలో వెంకటాపురం ఎస్సై, మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు రాక. ఇంటి వద్దనే ఉండే యువత ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడద్దని, అదేవిధంగా తమకు ఉన్న వ్యవసాయ భూములను గూర్చి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ వారి కష్టంలో భాగస్వాములు కావాలంటూ. పిల్లలు ఇంతటి విజ్ఞానానికి కారణం కావడానికి కృషి చేస్తూ, తల్లిదండ్రులు ఖర్చుపెట్టిన ప్రతి రూపాయిని జ్ఞాపకం చేసుకుంటూ,

నేటి యువత అక్రమ మార్గాల్లో కాకుండా సక్రమ మార్గాల్లో నడవాలి అంటూ, వెంకటాపురం సబ్ ఇన్స్పెక్టర్ అర్, అశోక్ ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం ఎస్సై తో పాటు ఏ.ఎస్.ఐ మరియు పోలీస్ బృందం సి.ఆర్.పి బలగాలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button