HealthHyderabadTelangana

తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు..

తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు.. కొత్త వేరియంట్‌పై అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి..

హైదరాబాద్..

కరోనా కొత్త వేరియంట్‌ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై.. కొవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు..

సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు మన వద్ద అలాంటి కేసులు బయటపడలేదని చెప్పారు..

ఈ వేరియంట్‌లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button