PoliticalTelangana

దాడి చేసిన కౌన్సిలర్ పై క్రిమినల్ కేసు

దాడి చేసిన కౌన్సిలర్ పై క్రిమినల్ కేసు

దాడి చేసిన కౌన్సిలర్ పై క్రిమినల్ కేసు

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూ తగాదాల కారణంగా ఏకంగా ప్రజలకు రక్షణ ఉండాల్సిన కౌన్సిలర్లే దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జమ్మికుంట పరిధిలోని మూడో వార్డు కౌన్సిలర్ ప్రభుత్వ భూమిలో అక్రమంగా బోరు వేస్తున్నారని అదే వార్డుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆరోపించారు.

ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశించారు. బోరు వేయడం కూడా నిలిపివేయాలని హెచ్చరించారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ ఫిర్యాదు చేసిన వారిపై ఇనుపరాడుతో దాడి చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జమ్మికుంట మున్సిపాలిటీ లోని 3వ వార్డు ఐన రామన్నపల్లిలో ప్రభుత్వ పాఠశాల, వాటర్ ట్యాంక్ పక్కన గల సన్వే నంబర్ 422 లో కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, అక్రమంగా బోర్ వేస్తున్నాడని

అదే వార్డుకు చెందిన మర్రి మల్లయ్య, కొలకని రాజు, మేడిపల్లి రమేష్ అక్కడికి వెళ్లి రవీందర్ ని బోర్ అక్రమంగా ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించగా వారిపై ఇనుప రాడ్ తో దాడి చేయగా మల్లయ్య కు తలపై, చేతులపై తీవ్ర గాయాలు కాగా, రాజుకి తలపై , రమేష్ కు చేతులపై గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

గత 2 నెలల క్రితం ఇట్టి కబ్జా విషయం పై మర్రి మల్లయ్య స్థానిక తహశీల్దార్ కి ఫిర్యాదు చేయగా ఆ విషయాన్ని మనుసులో ఉంచుకొని కావాలని చంపాలనే ఉద్దేశ్యంతో తన భర్తపై దాడి చేసి గాయపరిచాడని

మల్లయ్య భార్య మర్రి రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు రవీందర్ ను అదుపులో కి తీసుకొని అతనిపై సీ ఆర్ నంబర్ 56/2024 యూ/ఎస్ 307, 506 ఐ పీ సీ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశామని, తదుపరి రిమాండుకు తరలించడం జరుగుతుందని పట్టణ సీఐ రవి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button