KhammamPoliticalTelangana

ఏన్కూరులో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు

ఏన్కూరులో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు

ఏన్కూరులో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు

అనుమతులు లేకుండా మెడికల్ షాప్ నిర్వహణ

దుకాణం సీజ్, నిర్వాహకుడిపై కేసు నమోదు

CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 16 2026: ఏన్కూరు మండలం బీఆర్‌పురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా మెడికల్ షాప్ నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులకు సమాచారం అందింది. దీంతో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ దేవేందర్ రెడ్డి నేతృత్వంలోని అధికారులు ఆకస్మికంగా మెడికల్ షాపును తనిఖీ చేశారు.

తనిఖీల సందర్భంగా మెడికల్ షాప్ నిర్వహణకు సంబంధించిన లైసెన్స్, అవసరమైన అనుమతి పత్రాలను చూపించాలని నిర్వాహకుడిని అధికారులు కోరగా, ఎలాంటి చెల్లుబాటు అయ్యే పత్రాలు సమర్పించలేకపోయినట్లు తెలిసింది. దీంతో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం మెడికల్ షాపును అధికారులు సీజ్ చేశారు.

అనంతరం షాప్ నిర్వాహకుడిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, అనుమతులు లేకుండా మెడికల్ షాపులు నిర్వహించడం చట్టవిరుద్ధమని, ఔషధాల విక్రయానికి అవసరమైన అన్ని లైసెన్సులు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button