HyderabadPoliticalTelangana

RS ప్రవీణ్ కుమార్ అరెస్ట్

RS ప్రవీణ్ కుమార్ అరెస్ట్

RS ప్రవీణ్ కుమార్ అరెస్ట్

BSP RS ప్రవీణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. మంగళవారం రాత్రి జన్వాడలో దాడికి గురైన దళితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ఇవాళ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ప్రవీణ్ కుమార్ జన్వాడ వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్ చేయడంపై బీఎస్పీ శ్రేణులు భగ్గమన్నారు. నిందితులను అరెస్ట్ చేయకుండా.. మద్దతు తెలిపేందుకు వెళ్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేయడమేంటని కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రవీణ్ కుమార్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు.

దళితులపై డాడి చేసిన మూకలను 18 గంటలు గడిచిన పట్టుకోకుండా.. బాధితులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తనను అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణలో దళితులకు రక్షణ లేదన్నారు.

కేసీఆర్ రాచరిక పాలనను అంతమొందించి మీకు అధికారం ఇస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో మిలాఖత్ అయ్యి దళితులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ అంశంపై స్పందించారు. ”నిన్న రాత్రి జనవాడలో చర్చిపై, దళితులపై ఆరెస్సెస్(RSS) మూకలు జరిపిన దాడిలో ఇంతవరకు ఒక్క నిందితుడు కూడా అరెస్టు కాలేదు. భాదితులు ఇంకా హాస్పిటల్లోనే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

గ్రామంలో భయాందోళనలు నెలకొని ఉన్నాయి. రేవంత్ రెడ్డి.. ఇదేనా మీ గ్యారంటీల పాలన..? శాంతి భద్రతలకు గ్యారంటీ ఎక్కడున్నదీ ఈ రాష్ట్రంలో..? హాస్టల్లలో పిల్లల ప్రాణాలకు గ్యారంటీ లేదు..? మైనారిటీల బతుకులకు గ్యారంటీ లేదు..! రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కులకు గ్యారంటీ లేదు..! ఇందుకేనా తెలంగాణ ప్రజలు మిమ్ముల గద్దె నెక్కించింది..?” అని ట్వీట్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button