HealthHyderabadPoliticalTelangana

ఎక్మో (ECMO) విధానంతో ఊపిరితిత్తుల చికిత్సలో సరికొత్త విప్లవం!

ఎక్మో (ECMO) విధానంతో ఊపిరితిత్తుల చికిత్సలో సరికొత్త విప్లవం!

ఎక్మో (ECMO) విధానంతో ఊపిరితిత్తుల చికిత్సలో సరికొత్త విప్లవం!

చివరిదశ ఊపిరితిత్తుల వైఫల్యానికి అత్యంత అధునాతన వైద్యం అందుబాటులోకి

యశోద హాస్పిటల్స్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ వెల్లడి

ck news : తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకునే రోగులను కాపాడటంలో ‘ఎక్మో’ (కృత్రిమ గుండె-ఊపిరితిత్తుల పరికరం) విధానం ఒక సంజీవనిలా మారుతోందని హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ కాత్రగడ్డ తెలిపారు. ఈరోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక విలేఖరుల సమావేశంలో ఆమె ఈ అత్యంత సంక్లిష్టమైన వైద్య విధానం (ECMO Support with Lung Transplantation) యొక్క విశిష్టతను మరియు మౌలిక సదుపాయాల వివరాలను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రోగులకు అంతర్జాతీయ స్థాయి క్రిటికల్ కేర్ వైద్య సదుపాయాలు ఏ విధంగా అందుబాటులోకి వచ్చాయో వివరించడానికి, చివరి దశ ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుల్లో భరోసా నింపడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

ప్రాణం నిలిపే ‘ఎక్మో’ (కృత్రిమ శ్వాస వ్యవస్థ) విధానం: చివరి దశ ‘ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్’ (ILD) లేదా శ్వాసకోశ వైఫల్యం వల్ల ఊపిరితిత్తులు రక్తానికి ఆక్సిజన్‌ను అందించే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయినప్పుడు ఈ ‘వెనో-వీనస్ ఎక్మో’ (ECMO) లైఫ్ సపోర్ట్ విధానాన్ని ఉపయోగిస్తామని. ఈ విధానంలో అత్యాధునిక యంత్రం శరీరం వెలుపల ఉంటూ కృత్రిమ ఊపిరితిత్తుల వ్యవస్థలా పనిచేస్తుంది.

ఇది శరీరం నుండి ఆక్సిజన్ లేని చెడు రక్తాన్ని గ్రహించి, దానికి పూర్తి ఆక్సిజన్‌ను అందించి, కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించి మళ్లీ శరీరంలోకి పంపుతుంది. ఊపిరితిత్తుల మార్పిడి అవసరమైన రోగులకు, దాత దొరికేవరకు (Bridge to Transplant) ప్రాణాలను నిలిపి ఉంచడానికి ఈ సాంకేతిక విధానం అత్యంత కీలకమైనదని డాక్టర్ తపస్వి వివరించారు.

సెకన్ల సమన్వయంతో సాగే అవయవ మార్పిడి: ఈ ఎక్మో విధానంలో ఉన్న రోగులకు ఊపిరితిత్తుల మార్పిడి (Double Lung Transplant) చేయడం వైద్యశాస్త్రంలోనే అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. రక్తం గడ్డకట్టడం, అధిక రక్తస్రావం వంటి తీవ్రమైన సాంకేతిక ప్రమాదాలను అధిగమిస్తూ.. గుండె-ఊపిరితిత్తుల నిపుణులు, అనస్థీషియా వైద్యులు, ఐసీయూ నర్సింగ్ బృందం సెకన్ల సమన్వయంతో వ్యవహరించి ఈ సుదీర్ఘ శస్త్రచికిత్స ప్రక్రియను విజయవంతం చేయాల్సి ఉంటుందని. ఊపిరితిత్తుల వ్యాధి చివరి దశకు చేరినంత మాత్రాన ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదని, ఎక్మో వంటి అధునాతన మౌలిక సదుపాయాలతో కూడిన వైద్య విధానం ద్వారా ప్రాణాలు నిలపడం సాధ్యమేనని స్పష్టం చేశారు.

విజయవంతమైన రికవరీ విధానం: శస్త్రచికిత్స అనంతరం అందించే ప్రత్యేక అంతర్జాతీయ క్రిటికల్ కేర్ ప్రోటోకాల్స్ ద్వారా రోగులను ఎక్మో యంత్రం మరియు వెంటిలేటర్ల నుండి సురక్షితంగా తొలగించి, కొత్త ఊపిరితిత్తులతో స్వయంగా శ్వాస తీసుకునేలా చేస్తామని. ఆ తర్వాత క్రియాశీల శారీరక వ్యాయామాల ప్రక్రియ (రిహాబిలిటేషన్) ద్వారా రోగులు సాధారణ జీవితాన్ని గడిపేలా ఈ చికిత్సా విధానం తోడ్పడుతుందని డాక్టర్ తపస్వి వివరించారు.

ఈ విలేఖరుల సమావేశంలో యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ విభాగం సీనియర్ మేనేజర్ పరమేష్, మేనేజర్ ఉమేష్ మరియు అసిస్టెంట్ మేనేజర్ రాంప్రకాష్ మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button