Political

పొంగులేటి శీనన్న భారీ మెజారిటీనే మా లక్ష్యం..

పొంగులేటి శీనన్న భారీ మెజారిటీనే మా లక్ష్యం..

  • సాయి ప్రభాత్ నగర్ లో విశ్రాంత ఉద్యోగుల ఏకగ్రీవ తీర్మానం
  • ఆత్మీయ సమావేశానికి హాజరైన పొంగులేటి ప్రసాద్ రెడ్డి

ఖమ్మం రూరల్: పొంగులేటి శీనన్న అంటే మాకు ఓ నమ్మకం. జనం నేతగా ఆయన అందరికీ అండగా ఉంటారని గొప్ప ధైర్యం. అందుకే పాలేరు నుంచి శీనన్నను భారీ మెజారిటీతో గెలిపించుకోవడమే మా లక్ష్యo..
అని పెద్ద తండా గ్రామపంచాయతీ సాయి ప్రభాత్ నగర్ లోని విశ్రాంత ఉద్యోగులు గురువారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో స్వచ్ఛందంగా ఆత్మీయ సమావేశం నిర్వహించి.. ఈ మేరకు ప్రకటించారు. కాలనీ మొత్తం కాంగ్రెస్కే ఓట్లు పడతాయని ధీమా వ్యక్తం చేశారు.
పలువురు కాంగ్రెస్ లో చేరిక : వజ్జా శ్రీనివాసరావు, హనిమీ రెడ్డి, ప్రభాకర్ రావు, కాంతేశ్వరరావు, వార్డు వెంకటేశ్వరరావు, జట్టు మల్లికార్జున్, హుస్సేన్, మాధవరెడ్డి, కృష్ణారావు, జెట్టి శ్రీనివాసరావు, వడగాని శ్రీనివాస్ తదితరులు హస్తం గూటికి చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ప్రసాద్ రెడ్డి ఆహ్వానించారు.
పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..: సాయి ప్రభాత్ నగర్ లో మీ శీనన్న సీసీ రోడ్లు పోయిస్తారని, డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తారని తెలిపారు. మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తారని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో బానోత్ హరినాథ్, బానోత్ దివ్య, మాజీ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్, ఎర్రబోలు శ్రీనివాసరావు, గుగులోతు శ్రీను, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button