Bhadradri KottagudemPoliticalTelangana

మద్యం దుకాణాల్లో మద్యం నిల్.. బెల్ట్ షాపుల్లో మద్యం ఫుల్…

మద్యం దుకాణాల్లో మద్యం నిల్.. బెల్ట్ షాపుల్లో మద్యం ఫుల్…

మద్యం దుకాణాల్లో మద్యం నిల్.. బెల్ట్ షాపుల్లో మద్యం ఫుల్…

దుమ్ముగూడెం మద్యం సిండికేట్ పై పలు వార్తలు వచ్చినా ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవటం లేదు..?

ప్రతి క్వార్టర్ సీసాపై సిండికేట్ పేరుతో 20రూ నుండి 30రూ అధిక వసూళ్లు.

సిండికేట్ యాజమాన్యానికి జిల్లా ఎక్సైజ్ శాఖ సహకరిస్తుందా..?

పత్రికా మీడియా మిత్రులు పలు వార్తలు చిత్రీకరించి సమాచారం ఇచ్చిన ఎందుకు పట్టించుకోవడం లేదు.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

మే 08,
దుమ్ముగూడెం మండలం పరిధిలో ఉన్నటువంటి మూడు వైన్ షాప్ దుకాణాలు మధ్య ప్రజలకు పెనుబారం లాగా మారారు. అధికారకంగా మూడు చోట మద్యం దుకాణాలు ఉండగా అవి పేరుకే. మూడు మధ్యందుకాణాలు సిండికేట్ గా మారి 2 చోట్ల అసలు షాపులే తెరవకొండ ఆ షాపులకి రావాల్సిన మద్యం మొత్తం మొలకపాడు ఒకటో నెంబర్ షాపు వద్ద ఉంచి మద్యం సిండికేట్ నిర్వహిస్తున్నారు. అదే కాకుండ ప్రతి క్వార్టర్ సీసాపై ప్రతి బీరు సీసాపై 20 నుంచి 30 రూపాయలు అధిక ధరలతో వసూళ్లు చేస్తున్నారు. మద్యం ప్రియులు ఎంతో ఆశగా మద్యాన్ని సేవిద్దాం అని వైన్ షాపుల వద్దకు వెళ్తే వాళ్ళ జోబుకి చిల్లు పెట్టి వాళ్ల జేబులు నింపుకుంటున్నారు. పలుమార్లు స్థానికులు మధ్యప్రయులు పత్రిక సోదరులు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎక్సేంజ్ శాఖ అధికారులకు పలు అనుమానాలు వచ్చే వ్యవధిలో వారికి ముడుపుల రూపంలో అందుతున్నాయని మధ్య ప్రియులు చర్చించుకుంటున్నారు.

అన్ని బ్రాండ్లు బెల్ట్ షాపులోనే……!

చెప్పులకు సిండికేట్ మాఫియాతో వైన్ షాపులో దొరకని బ్రాండ్లు బెల్ట్ షాపులోని దర్శనమిస్తున్నాయి. మధ్య తరగతి రోజువారి కార్మికులు అధికంగా సేవించే మద్యం బెల్ట్ షాపులోనే ఒక్కో క్వార్టర్పై 60 నుండి 80 రూపాయలు అధికంగా అమ్ముతున్న ఎక్సైజ్ శాఖ చూసి చూడనట్టు ఎవరు ఇస్తుంది. అంతేకాకుండా గుడి బడి అంటూ ఏ తేడా లేకుండా విద్యాసంస్థల అతి సమీపంలో దేవాలయాల పక్కనే బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నిర్వహిస్తున్న పట్టించుకునే నాధుడే లేరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణకి సరిహద్దుగా ఉన్న దుమ్ముగూడెం మండలంలో చత్తీస్గడ్, ఒరిస్సా నుండి నాసిరకపు జీరో సరుకు దుమ్ముకోవడానికి తలలి వస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్తీ మద్యం సేవించి మందుబాబుల ఆరోగ్యం క్షీణిస్తున్న సిండికేట్ మీద ఉన్న ప్రేమతో ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్టే వివరిస్తున్నారని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

పత్రికలలో కథలను వచ్చిన స్పందించని అధికారులు

మద్యం మాఫియా పై ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని ప్రకంబాలు పలికే ఎక్స్ఎన్ శాఖ అధికారులు దుమ్ముగూడెంలో జరుగుతున్న మధ్య మాఫియా పై సామాజిక మాధ్యమాలలో పత్రికలలో కథనాలు వచ్చిన స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది. గల్లి గల్లి లో బెల్ట్ షాపు నిర్వహిస్తూ శాంతిభద్రతలకు విగాథం కలిగిస్తున్న పోలీస్ శాఖ కూడా చూసి చూడనట్టు వివరించడంతో మద్యం మాఫియా హద్దు అదుపు లేకుండా పెట్రేగిపోతుంది. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం వీడకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు పలు ప్రజాసంఘాలు సిద్ధమవుతున్నాయని తెలుస్తుంది. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ మత్తు నిద్ర వదిలి మద్యం మాఫియా బెల్టు తీస్తారా లేదా అన్నది వేచి చూడాల్సింది

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button