CinemaEntertainmentHyderabadPoliticalTelangana

రింగ్ రోడ్డుపై ప్రమాదం... ఇద్దరు నటుల దుర్మరణం.!

రింగ్ రోడ్డుపై ప్రమాదం... ఇద్దరు నటుల దుర్మరణం.!

రింగ్ రోడ్డుపై ప్రమాదం… ఇద్దరు నటుల దుర్మరణం.!

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు షార్ట్‌ ఫిల్మ్‌ యాక్టర్లు దుర్మరణం చెందారు.

ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నోయల్‌రాజ్‌ తెలిపిన ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లా వేదాయపాలేనికి చెందిన కత్తి భరత్‌కాంత్‌ (31), గూడ సాయి త్రిలోక్‌ (31) షార్ట్‌ఫిల్మ్‌ యాక్టర్లు.

శనివారం నెల్లూరు నుంచి కారులో హైదరాబాద్‌ బయలుదేరారు. ఓఆర్‌ఆర్‌ మీదుగా శంషాబాద్‌ వైపు వెళ్తుండగా.. బొంగ్లూర్‌ సమీపంలో మితిమీరిన వేగం కారణంగా కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. కారులోని భరత్‌కాంత్, గూడ సాయి త్రిలోక్‌ తీవ్రగాయాలతో మృతి చెందారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button