
వివాహ వార్షికోత్సవాన్ని సేవా దినోత్సవంగా మార్చిన డాక్టర్ కొలిశెట్టి నరేష్ దంపతులు
చలివేంద్రం, మజ్జిగ పంపిణీతో ప్రజాసేవలో మరోసారి ఆదర్శంగా నిలిచిన వైద్య దంపతులు
సికే న్యూస్ ప్రతినిధి ఏన్కూరు, మే 12 : తమ 12వ వివాహ వార్షికోత్సవాన్ని వ్యక్తిగత వేడుకగా కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా నిర్వహిస్తూ గ్రామీణ వైద్యుడు డాక్టర్ కొలిశెట్టి నరేష్, రాజేశ్వరి దంపతులు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. మండుతున్న ఎండలు, 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏన్కూరులోని గాయత్రి హాస్పిటల్ ఎదుట వేపచెట్టు నీడలో ఉచిత చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిస్తూ స్టీల్ గ్లాసులతో చల్లటి తాగునీటిని అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులు, రహదారిపై ప్రయాణించే ప్రజలకు సుమారు 30 లీటర్ల పెరుగుతో తయారు చేసిన చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ ప్రజాప్రతినిధులు, నాయకులు ఫోన్ ద్వారా మరియు సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియజేశారు.వ్యక్తిగత ఆనందాన్ని ప్రజాసేవతో మేళవించి సమాజానికి సందేశం ఇచ్చిన డాక్టర్ కొలిశెట్టి నరేష్– రాజేశ్వరి దంపతుల సేవా స్పూర్తి అందరికీ ఆదర్శంగా నిలిచిందని పలువురు కొనియాడారు.



