Andhra PradeshPolitical

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లపై మంత్రి కీలక ప్రకటన

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లపై మంత్రి కీలక ప్రకటన

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లపై మంత్రి కీలక ప్రకటన

Web desc : స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త. త్వరలోనే సచివాలయ ఉద్యోగులకు నోషనల్‌ ఇంక్రిమెంట్‌ అమలు చేస్తామని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని రికార్డు అసిస్టెంట్‌ హోదాలో నియమించింది అన్నారు.

ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇతర సౌకర్యాలు లేకుండా చేశారని ఆరోపించారు.. కూటమి ప్రభుత్వం దీన్ని సరిచేస్తోందన్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇప్పటికే వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ, పంచాయతీరాజ్, వైద్య, రెవెన్యూశాఖలకు చెందిన 7,246 మందికి ప్రమోషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిశాఖ సచివాలయ ఉద్యోగికి ప్రమోషన్‌ ఛానల్‌ కల్పి్ంచడంతో పాటుగా నోషనల్‌ ఇంక్రిమెంట్‌ కూడా అమలు చేస్తామని తెలిపారు.

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ఉద్యోగుల అంతర్‌జిల్లా బదిలీల విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు మంత్రి స్వామి. ఉద్యోగులకు సచివాలయ ఉద్యోగులకు స్పౌజ్‌ బదిలీలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

సచివాలయం పరిధిలో ఒక ఉద్యోగి మీదే ఎక్కువ పనిభారం లేకుండా త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. సెలవుకు సంబంధించి సరైన కారణం ఉన్నా సరే ఉన్నతాధికారి నిరాకరిస్తే ఆటోమెటిక్‌గా ఆ సెలవు పొందే సౌకర్యాన్ని కల్పించామన్నారు. ప్రత్యేకంగా సిబ్బంది గ్రీవెన్స్‌ను తీసుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

కొందరు సిబ్బందికి కన్సాలిడేట్ పే రూ. 15వేలుగా ఉందని.. ఈ అంశాన్ని పునఃసమీక్షించి పే స్కేల్ అమలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో సచివాలయాల సిబ్బందితో యూనిఫైడ్‌ సర్వేతోనే సర్వేలు ఆపివేయించామని.. విపత్తులు ఎదురైతే మాత్రం అందరూ పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హాస్టల్స్‌లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఔట్ సోర్సింగ్ ద్వారా సిబ్బందిని నియమించామన్నారు మంత్రి స్వామి. జర్మన్‌ భాషలో 200 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇప్పించామన్నారు. గురుకులాల్లో సాంత్వన పథకాన్ని రూ. 5 కోట్లతో ఆరోగ్య భద్రత కోసం అమలు చేస్తున్నామన్నారు.

దివ్యాంగులు, వృద్ధులు, హిజ్రాలకు టిడ్కో ఇళ్లలలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే వీరికి ఇళ్ల కేటాయిస్తామన్నారు. ఈ ఏడాది నుంచే వినికిడి లోపం ఉన్న వారికి ప్రత్యేక డిగ్రీ కాలేజీ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తిరుపతిలో హిజ్రాలకు హాస్టల్ నిర్మాణం, ప్రత్యేకంగా సింగిల్‌ రేషన్‌కార్డులు అందిస్తామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button