
ఫిల్మ్‌నగర్‌లో అర్ధరాత్రి బీభత్సం… నటుడు ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
Web desc : సినీ ప్రముఖుల నివాసం ఉండే ఫిల్మ్‌నగర్ లో గురువారం అర్ధరాత్రి వేళ ఘోర కారు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ లగ్జరీ కారు అదుపుతప్పి, ప్రముఖ నటుడు ధర్మ నివాసంలోకి దూసుకెళ్లింది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొంతమంది యువకులు కారులో ఫిల్మ్‌నగర్ రోడ్డుపై అతివేగంగా ప్రయాణిస్తున్నారు. మితిమీరిన వేగం కారణంగా మలుపు వద్ద కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను దాటుకుంటూ నేరుగా నటుడు ధర్మ ఇంటి కాంపౌండ్ గోడను, గేటును బలంగా ఢీకొడుతూ లోపలికి దూసుకెళ్లింది.
అయితే, ప్రమాదం జరిగిన సమయంలో కారును నడిపిన యువకులు పూర్తి మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసుల అదుపులో యువకులు.. భారీ శబ్దం రావడంతో నటుడు ధర్మ కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు.
అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ధర్మ కుటుంబ సభ్యులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు, తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై నటుడు ధర్మ, కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కారులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.




