
దొంగను పట్టుకున్న పోలీసు బృందం
సి కె న్యూస్ కొల్చారం నర్సాపూర్
మెదక్ జిల్లాకొల్చారం మండల పరిధిలోని నాయిని జలాల్పూర్ గ్రామానికి చెందిన ఫిర్యాదారులకు నాయిని రాయన్న తండ్రి కిష్టయ్య వయసు 62 సంవత్సరాలు కులం మున్నూరు కాపు వృత్తి వ్యవసాయం గారి ఇంట్లో తేదీ 06.07.2026 గుర్తుతెలియని దొంగలు ఇంటి తాళం మొదలుపెట్టి దొంగతనం చేసినారని ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు పరిచయం అయినది ఇట్టి దొంగతనం విషయంలో ఈరోజు తేదీ 19.07.2026 నాడు ఏడుపాయల T జంక్షన్ వద్ద కొల్చారం పోలీస్ వారు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేయుచుండగా నాయిని జలాల్పూర్ గ్రామానికి చెందిన దుబ్బగళ్ల అలియాస్ నిరుడి కృష్ణ తండ్రి రాములు వయస్సు 43 సంవత్సరంలో కులం ఎస్సీ మాల వృత్తి కూలి పని అను వ్యక్తి ప్యాసింజర్ ఆటోలో మెదక్ వైపు వెళుతుండగా అట్టి ఆటోను ఆపి విచారించగా అట్టి వ్యక్తి సమాధానము చెప్పనందున కొల్చారం పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి తగు విచారణ చేయగా అట్టి వ్యక్తి నాని జలాల్పూర్ గ్రామానికి చెందిన నాయిని రాయన్న గారి ఇంట్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు అట్టి వ్యక్తి నుండి అర్ధ తులం బంగారం ఉంగరం మరియు 51 వేల నగదు రూపాయలు స్వాధీనపరచుకొని అట్టి వ్యక్తి నీ రిమాండ్ నిమిత్తం జే ఎఫ్ సి ఎం మెదక్కోటుకు పంపనైనది




