
రోడ్డు ప్రమాదంలో వెంకంపాడు సర్పంచ్ మృ*తి
Web desc : ట్రాలీ ఢీకొని సర్పంచ్ మృ*తి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామంలో సోమవారం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెంకంపాడు సర్పంచ్ ఉప్పల సోమన్న(30) ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా ఎన్నికయ్యారు.
పనుల్లో భాగంగా మండల కేంద్రానికి వచ్చి తిరిగి స్వగ్రామానికి బైకుపై వెళ్తుండగా గిరిపురం గ్రామంలో ట్రాలీ వేగంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




