
సికె.న్యూస్. ప్రతినిధి.ఆదిలాబాద్
పాఠశాల విద్యార్థిని చితకబాదిన టీచర్.. యాజమాన్యంపై కేసు నమోదు
బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు తల్లి ఫిర్యాదు
బోథ్ పోలీస్ స్టేషన్ లో కేసు
బోథ్ ఎస్ఐ వి పురుషోత్తం
బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న బాలుడిపై టీచర్ దాడి చేసిన ఘటనకు సంబంధించి టీచర్‌తో పాటు పాఠశాల యాజమాన్యంపై బోథ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు బోథ్ ఎస్ఐ వి పురుషోత్తం తెలిపారు.
ఫిర్యాదు ప్రకారం.. కుచలాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమారుడు బోథ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడని తెలిపింది. ఈ నెల 27న ఉదయం సుమారు 11 గంటల సమయంలో బాలుడు తరగతి గదిలో ఉండగా, క్లాస్ టీచర్ అతడిని కొంతసేపు చెవులు పట్టించి, చెంపలు మరియు శరీరంపై కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తరువాత ఇంటికి వచ్చిన బాలుడు ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు గమనించగా, చెవి, చెంప తదితర ప్రాంతాల్లో గాయాలున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియో కూడా తమ వద్ద ఉందని ఫిర్యాదుదారు పోలీసులకు అందజేశారు.
ఈ ఫిర్యాదు మేరకు బోథ్ పోలీస్ స్టేషన్లో సంబంధిత సెక్షన్లు మరియు జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
పిల్లలపై ఎలాంటి హింసకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.




