
“చక్రపాణి నా తండ్రే.. డిఎన్ఏ టెస్ట్‌కు సిద్ధం”..
– తండ్రి గుర్తింపు కోసం యువకుడి డిమాండ్..
– తమని బెదిరిస్తున్నారని ఆరోపణ.
సి కె న్యూస్ ప్రతినిధి గద్వాల
ధరూర్: తన తల్లి చింతరేవుల చక్రపాణితో కలిసి జీవించిందని, తనకు జన్మనిచ్చిన తండ్రి ఆయనేనని పేర్కొంటూ ఓ యువకుడు తండ్రి గుర్తింపు కోసం డిమాండ్ చేస్తున్నాడు. తన తల్లిని పెళ్లి చేసుకుంటానని చక్రపాణి హామీ ఇచ్చి, అనంతరం మోసం చేశారని యువకుడు ఆరోపించాడు.
తాను చక్రపాణి సంతానమేనని నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. డీఎన్ఏ పరీక్ష నిర్వహించి వాస్తవాలను నిర్ధారించి, తనకు తండ్రి గుర్తింపు కల్పించాలని కోరాడు.
ఈ విషయంపై చక్రపాణిని ప్రశ్నించిన సమయంలో “నిన్ను, నీ బాబును చంపేస్తా” అంటూ బెదిరిస్తున్నారని యువకుడు ఆరోపించాడు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరాడు.
న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని యువకుడు స్పష్టం చేస్తూ తన తల్లితో కలిసి ఇంటి ముందు భైఠయించాడు.




