
కాంగ్రెస్ సర్కారు 1,000 రోజుల విజయోత్సవం
సి కే న్యూస్, రాయపర్తి : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు.
రాయపర్తి మండలంలోని మైలారం, వెంకటేశ్వరపల్లి, సన్నూరు, ఊకల్, గట్టికల్, పేరుకేడ్, రామన్నగూడెం తదితర గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ కొనసాగి రాయపర్తి మండల కేంద్రానికి చేరుకుంది. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తూ 1,000 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకోవడం గర్వకారణమన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ యూకార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, సర్పంచులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




