KhammamPoliticalTelangana

కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన.. ఏన్కూరులో జోష్‌

కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన.. ఏన్కూరులో జోష్‌

కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన.. ఏన్కూరులో జోష్‌

కేక్‌ కట్‌ చేసి సంబరాలు.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం

సీకే న్యూస్‌ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ ఏన్కూరు సెప్టెంబర్‌ 03 2026: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఏన్కూరు మండల కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ.. 1000 రోజుల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

పేదవాడి ముఖంలో చిరునవ్వే ఇందిరమ్మ రాజ్యానికి అసలైన అర్థమని నాయకులు అన్నారు. పేద కుటుంబాలకు అండగా నిలవడం, ప్రతి నిరుపేదకు సొంతింటి కలను సాకారం చేయడం, రైతులకు భరోసా కల్పించడం, మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

గతంలో ఇచ్చిన హామీలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా.. ఒక్కొక్క హామీని అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం.. రైతుల రాజ్యం.. మహిళల రాజ్యం.. యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే రాజ్యమని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు చేరువగా పాలన కొనసాగిస్తామని తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కాంగ్రెస్‌ శ్రేణులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించగా, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button