
మధిరలో తహసిల్దార్ కార్యాలయం వద్ద లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో భారీ ధర్నా
420 అడుగుల ఫ్లెక్సీతో కాంగ్రెస్ 420 మేనిఫెస్టోలోని అబద్ధపు హామీలపై మధిర పురవీధుల్లో భారీ ప్రదర్శన
బైక్ ర్యాలీతో ఫ్లెక్సీ ర్యాలీతో కధం తొక్కిన బిఆర్ఎస్ శ్రేణులు
మధిర సెప్టెంబర్ 02(సికె న్యూస్)ప్రతినిధి.
మధిర లో కాంగ్రెస్ ఆరు హామీలపై ఎండగట్టిన ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మధిర నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 6 హామీల కార్డు ను ఎన్నికల సమయంలో ఇచ్చి ఇది ప్రతి ఒక్కరూ దాచి పెట్టుకోవాలని చెప్పారని అంతే కాకుండా ₹100 స్టాంపు పేపర్ పై హామీ వ్రాయించి ఇచ్చారని ఈ విధంగా మోసం చేయడంలో బట్టి విక్రమార్క ముందున్నారని ప్రజలు మోసపోయారని కాబట్టి ఆ హామీ కార్డును కాంగ్రెస్ బాకీ కార్డుగా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ ఉన్నదో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ప్రజలకు అభిమానులకు వివరించి ప్రతి కాంగ్రెస్ నాయకుల్ని నిలదీసి తమకు రావలసిన బాకీని వసూలు చేసుకోవాలని చెప్పారు
అలాగే పుట్టిన బిడ్డకు ఇవ్వవలసిన కెసిఆర్ కిట్ వద్ద నుండి విద్యార్థులకు ఫీజ్ కార్డులు యువతులకు 2500 విద్యార్థునలకు స్కూటీలు వివాహం అయిన వారికి కెసిఆర్ ఇచ్చిన లక్ష 16 వేల తో పాటుగా తులం బంగారం ఆసరా పెన్షన్ 4000 పెంచుతానని దివ్యాంగులకు 6000 చేస్తానని రైతులకు 15000 ఇస్తానని రైతు కూలీలకు 15000 ఇస్తానని ఆటో వాళ్లకు 10000 ఇస్తానని ఇలా ప్రతి ఒక్క రంగాన్ని ప్రతి ఒక్క వయసు ఉన్న వారిని కాంగ్రెస్ పార్టీ తన అబద్దాలతో మోసం చేసిందని దుయ్యబట్టినారు
కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వంద రోజుల్లో హామీలు అమలు చేస్తాను అని చెప్పి ఈ రోజుకు సరిగ్గా వెయ్యి రోజులైంది అని వీళ్ళు ఇంకా కూడా అబద్దాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని మీ పప్పులు ఉడకవు అని హెచ్చరించినారు
ఈ కార్యక్రమంలో లింగాల కమల్ రాజు గారితో పాటుగా మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.




