
గురుకుల విద్యార్థి ఆత్మ*హత్య… టీచర్ వేధింపులే కారణమంటూ రోడ్డుపై నిరసన
Web desc : నాగర్‌కర్నూల్ జిల్లాలో గురుకుల కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మ*హత్య చేసుకోవడం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. ఇంటర్ స్టూడెంట్ భరత్ ఆత్మ*హత్యకు ఉపాధ్యాయుడి వేధింపులే కారణమని మిగిలిన విద్యార్ధులు నిరసనకు దిగారు. గురుకుల కాలేజీలో లెక్చరర్ టార్చర్ పెట్టడం వల్లే భరత్ సొంత ఊరికి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడని స్టూడెంట్స్ ఆరోపించారు.
వెంటనే ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇంతలో పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే భైటాయించారు స్టూడెంట్స్. దీంతో కొంత ఉద్రిత్త పరస్థితులు నెలకున్నాయి. గురుకుల కాలేజీ స్టూడెంట్స్ నిరసనకు బీఆర్ఎస్‌వీ మద్దతు తెలిపింది.

స్టూడెంట్ బలవన్మరణం.. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్ధుల ఆత్మ*హత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీపురం రోడ్డులోని మహాత్మా జ్యోతిబా పూలే కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న భరత్ అనే విద్యార్థి తన సొంత గ్రామంలో ఉరివేసుకుని ఆత్మ*హత్య చేసుకున్నాడు.
నేపథ్యంలో తోటి విద్యార్థుల నిరసన చేపట్టారు. ఉపాధ్యాయుడి వేధింపుల కారణంగానే భరత్ ఆత్మ*హత్య చేసుకున్నాడని ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. టీచర్ వేధింపులే కారణమా.. స్టూడెంట్ భరత్ చావుకి ఉపాధ్యాయుడి వేధింపులే కారణమని వెంటనే లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మిగిలిన విద్యార్ధులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు.
కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బస్సులో వెళ్తున్న విద్యార్ధులను పోలీసులు బలవంతంగా దింపడంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. రోడ్డెక్కిన స్టూడెంట్స్.. రోడ్డుపై నిరసన తెలుపుతున్న విద్యార్థులకు బీఆర్ఎస్‌వీ నాయకులు సంఘీభావం తెలిపారు.
విద్యార్ధులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన పోలీసులు నిరసన చేస్తున్న వాళ్లను గురుకులానికి తరలించారు. అయితే స్టూడెంట్ భరత్ చావుకు కారణం ఏమై ఉంటుందనే దానిపై మహాత్మా జ్యోతిబా పూలే కళాశాల అధ్యాపకుల నుంచి ఎలాంటి వివరణ లేకపోవడంతో విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




