మాటల యుద్ధం.. ఎమ్మెల్యే పీఏ చెంప చెల్లుమనిపించిన మంత్రి.. వీడియో వైరల్
Social media viral : రోడ్డు నిర్మాణంలో జరిగిన అవినీతిపై ప్రశ్నించిన యువకుడిని చెంప చెళ్లుమనేలా ఓ మంత్రి కొట్టిన వీడియో వైరల్ గా మారింది. అవినీతిపై స్థానికులు ప్రశ్నించడంతో చిర్రెత్తుకొచ్చిన మంత్రి.. దీంతో సదరు మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్ష ఆప్ డిమాండ్ చేస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ పరిధిలో రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను ఇవాళ ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) మంత్రి, బీజేపీ నేత పర్వేష్ వర్మ పరిశీలనకు వచ్చారు. అదే సమయంలో స్థానిక స్థానిక ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ తన అనుచరులతో అక్కడికి హాజరయ్యారు. నాసిరకం పనుల చేస్తున్నారని వేసిన రోడ్డును తన చేతితో పెకిలించి మంత్రికి చూయించాడు.
పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ పరిధిలో నిర్మిస్తున్న రోడ్డు పనుల తనిఖీకి PWD మంత్రి పర్వేష్ వర్మ వెళ్లారు. అక్కడకు స్థానిక ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్, ఆయన పిఏ, సోషల్ మీడియా విభాగం చూసుకునే సాహిబ్ సింగ్ కూడా వచ్చారు. ఈ సమయంలో ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ కొత్తగా వేసిన తారు రోడ్డును తన చేతులతోనే పెకిలించి చూపిస్తూ ‘మంత్రి గారూ.. బీజేపీ పాలనలో జరుగుతున్న పనుల నాణ్యత చూడండి.
ఈ రోడ్డు 15 గంటలు కూడా నిలవదు’ అని ఎద్దేవా చేశారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మీరు 15 ఏళ్లలో రోడ్లు వేయలేదు, మేము వేస్తుంటే తప్పు పడుతున్నారు అని మంత్రి అనగా ఆక్రమాలు బయటపడుతున్నాయని ఎమ్మెల్యే మండిపడ్డారు. మాటల యుద్ధం ముదిరి మంత్రి పర్వేష్ వర్మ అక్కడ నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించారు.
ఆ సమయంలో ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ పీఏ సాహిబ్ సింగ్ ఫోన్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ మంత్రిని అనుసరించారు. ఈ క్రమంలో కోపంతో రగిలిపోయిన మంత్రి ఆగ్రహంతో ఒక్కసారిగా సాహిబ్ సింగ్ చేతిలోని ఫోన్‌ను లాగి, కుడిచేత్తో చెంపపై గట్టిగా కొట్టారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.