
మతిస్థిమితం లేని బాలుడిని అన్నం సేవా ఫౌండేషన్‌కు అప్పగించిన చింతకాని ఎస్‌ఐ జి నరేష్
అన్నం సేవా ఫౌండేషన్‌కు అప్పగించిన చింతకాని ఎస్‌ఐ జి నరేష్
అన్నం సేవా ఫౌండేషన్‌కు అప్పగించిన చింతకాని ఎస్‌ఐ జి నరేష్
మతిస్థిమితం లేని బాలుడిని అన్నం సేవా ఫౌండేషన్‌కు అప్పగించిన చింతకాని ఎస్‌ఐ జి నరేష్
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
చింతకాని సెప్టెంబర్ 28
చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా మతిస్థిమితం లేని బాలుడు రోడ్లపై తిరుగుతూ కనిపిస్తున్నాడు. ఈ విషయాన్ని స్థానికులు చింతకాని ఎస్‌ఐ జి. నరేష్ దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన ఎస్‌ఐ జి. నరేష్ ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్ నిర్వాహకులకు సమాచారం అందించారు. అనంతరం అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ అన్నం శ్రీనివాసరావుకు బాలుడిని అప్పగించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ నరేష్ మాట్లాడుతూ.. మండల పరిధిలో మతిస్థిమితం లేని వారు లేదా ఆపదలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. బాలుడికి ఆశ్రయం కల్పించేందుకు ముందుకు వచ్చిన అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ అన్నం శ్రీనివాసరావుకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.




