
స్పెషల్ టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు అక్టోబర్ 03 2026: ఏన్కూర్ పీఎం శ్రీ గురుకుల విద్యాలయంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు బోధించేందుకు అర్హత కలిగిన స్పెషల్ టీచర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వేము రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాత్కాలిక ప్రాతిపదికన నవంబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు పనిచేసేందుకు స్పెషల్ టీచర్లను నియమించనున్నట్లు పేర్కొన్నారు. స్పెషల్ టీచర్ శిక్షణకు సంబంధించిన ధ్రువపత్రాలతో అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హతలు, ధ్రువపత్రాలతో గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని ప్రిన్సిపాల్ కోరారు.




