MedakPoliticalTelangana

డేకోర్ పేపర్ మిల్స్ తో ప్రజలకు ప్రాణహాని ముప్పు

డేకోర్ పేపర్ మిల్స్ తో ప్రజలకు ప్రాణహాని ముప్పు

అధికారులు వెంటనే స్పందించాలి,

ప్రజల ప్రాణాల కంటే పరిశ్రమలై ముఖ్యమా

ప్రజల ఆవేదన

నేలపై నల్లటి రేణువులు
పశువులకు ప్రాణహాని,

అక్టోబర్ 03 (సీ కే న్యూస్) చేగుంట:

మెదక్ జిల్లా చేగుంట మండలం, పొలంపల్లి గ్రామ శివారులోని గల డెకార్ పేపర్ మిల్స్ నుండి వెలువడుతున్న నల్లటి బూడిద, కాలుష్యం కారణంగా పోలంపల్లి గ్రామ ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది.కాలుపై నల్లటి బూడిద గ్రామంలో నడిచిన వ్యక్తులకాలుపై పేరుకుపోయిన నల్లటి మసి. చర్మంపై అంటుకుని దురద, అలర్జీ వస్తోందని గ్రామస్తుల ఆవేదన.

తాగే నీటి ప్యాకెట్ పై నల్లటి బూడిద,

తాగేందుకు ఉపయోగించే వాటర్ ప్యాకెట్ పై కూడా నల్లటి రేణువులు. ఇదే గాలిలో కలిసి ప్రజల కళ్లలోకి ఊపిరితిత్తుల్లోకి వెళ్తోందని అంటున్నారు.

ఆకులపై నల్లటి బూడిద పంట ఆకులపై, చెట్లపై పేరుకుపోయిన నల్లటి బూడిద. పంటలు దెబ్బతింటున్నాయి, పశువులు ఆకులు తింటే రోగాల బారిన పడుతున్నాయి.

ప్రజల ఆవేదన, మాకు ప్రాణహాని ముప్పు:

కళ్ళలో మంటలు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
చర్మంపై దురద, అలర్జీ
పిల్లలు, వృద్ధులు బయటకు రాలేని పరిస్థితి,
ఈ బూడిదను పీలిస్తే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందనిప్రజలు ఆందోళన చెందుతున్నారు,

ప్రజల డిమాండ్
కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) జిల్లా కలెక్టర్, చేగుంట తహశీల్దార్ వెంటనే స్పందించాలి. డెకార్ పేపర్ మిల్స్ పై చర్యలు తీసుకుని, ఫిల్టర్లు ఏర్పాటు చేయించాలి. ప్రజలకు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button