NagarkarnoolPoliticalTelangana

వైద్యం వికటించి బాలింత మృ*తి... అంటూ బంధువుల ఆరోపణ

వైద్యం వికటించి బాలింత మృ*తి... అంటూ బంధువుల ఆరోపణ

వైద్యం వికటించి బాలింత మృ*తి… అంటూ బంధువుల ఆరోపణ

Web desc : నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం పోలిశెట్టి పల్లి గ్రామానికి చెందిన బాలింత పద్మ వైద్యం కోసం అచ్చంపేట లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చారు శాస్త్ర చికిత్స చేశారు. పాపకు జన్మనిచ్చిన పద్మ వైద్యం వికటించి బాలింత పద్మ మృతి చెందటంతో వివాదానికి దారితీసింది.

పోలీసులకు చనిపోయిన పద్మ బంధువులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు బలవంతంగా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశారు. బంధువులకు పోలీసులకు కొంత సేపు వాగ్వాదం నెలకొంది.

పురిటి నొప్పులతో స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన పద్మకు వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేశారు. అయితే ఆ తర్వాత ఆమె ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందిన పద్మ. అచ్చంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రుల వైద్యుల నిర్లక్ష్యమే తమ కుటుంబ సభ్యురాలి మృతికి కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.

మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పోలీసులు, కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బాలింత పద్మ మృతదేహాన్ని పోలీసులు బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button