
ఆర్టీసీ బస్సు – డీసీఎం వ్యాన్ ఢీకొని ఆరుగురికి గాయాలు
సి కే న్యూస్.
తల్లాడ తల్లాడ దేవరపల్లి జాతీయ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి.
సత్తుపల్లి డిపో కి చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళుతుండగా, హైదరాబాద్ నుంచి తిరువూరుకు పచ్చల సీసాలతో వెళుతున్న డీసీఎం వ్యాన్ రెండు ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న తల్లాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.




