
రూ.40 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్సై…
Web desc : ఆదిలాబాద్ : ప్రమాద కేసు నుంచి తప్పించేందుకు బాధితుడి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ బజార్హత్నూర్ ఎస్సై రమేశ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం మోర్ఖండి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి యాక్సిడెంట్ కేసులో ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఎస్సై రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో అధికారులు బుధవారం మధ్యాహ్నం ట్రాప్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో బాధితుడి నుంచి ఎస్సై డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని ఎస్సైని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. పోలీసు శాఖలో లంచం వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.




