
ప్రభుత్వ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు.. ఇంటర్ పాసై 40 ఏళ్లలోపు ఉంటే చాలు..
Web desc : ప్రభుత్వ రంగానికి చెందిన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL), వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 23.
విద్యార్హతలు : గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి కనీసం 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంఎస్ విండోస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ వంటి కంప్యూటర్ ప్యాకేజీలపై పట్టు ఉండాలి.
డీఓఈఏసీసీ లేదా ఏదైనా ప్రభుత్వ / గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థ నుంచి సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి.
కంప్యూటర్, ఇంటర్నెట్/ ఈ–మెయిల్‌పై మంచి పని అనుభవం కలిగి ఉండాలి. టైపింగ్ వేగం: కంప్యూటర్‌పై ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలకు పైగా టైపింగ్ వేగం కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలక వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 2.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు ఫీజు ఉండదు. ఇతరులు రూ. 295 చెల్లించాలి.
లాస్ట్ డేట్: నవంబర్ 17.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.becil.comను సందర్శించండి.




