
బెల్ట్‌షాపులపై పోలీసుల మెరుపు దాడులు!
మద్యం సీజ్ ఇద్దరిపై రెండు కేసులు నమోదు
మల్దకల్ నవంబర్ 3:
జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామంలో బెల్ట్‌షాపులు, సిట్టింగ్‌ల నిర్వహణపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఉలవ తిమ్మప్ప, బండి శీను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బెల్ట్‌షాపులపై మల్దకల్ ఎస్సై కె. శ్రీహరి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్‌షాపుల నిర్వహణపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని ఎస్సై కె. శ్రీహరి స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత మద్యానికి బానిస కాకుండా, కుటుంబాలు ఆర్థికంగా మరియు సామాజికంగా నష్టపోకుండా ఉండేందుకు బెల్ట్‌షాపులపై తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.
అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.



