KhammamPoliticalTelangana

ఉద్యోగుల నిస్వార్థ సేవలే సమాజానికి ఆదర్శం… మంత్రి పొంగులేటి

ఉద్యోగుల నిస్వార్థ సేవలే సమాజానికి ఆదర్శం… మంత్రి పొంగులేటి

ఉద్యోగుల నిస్వార్థ సేవలే సమాజానికి ఆదర్శం… మంత్రి పొంగులేటి

విద్యుత్ శాఖల లైన్ ఇన్స్పెక్టర్ గడ్డికొప్పుల రాములు ఉద్యోగ విరమణ సభలో పాల్గొన్న మంత్రి

సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం/తిరుమలాయపాలెం, నవంబర్- 03

ఉద్యోగుల నిస్వార్థ సేవలే సమాజానికి ఆదర్శమని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి, విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ విరమణ చేసిన గడ్డికొప్పుల రాములు ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో రాములు వారి కుటుంబ సభ్యులను మంత్రి శాలువాతో సత్కరించి అభినందించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యుత్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు, రైతులకు విశేష సేవలందించి రాములు ఉద్యోగ విరమణ పొందారన్నారు. ఉద్యోగంలో చేరినప్పుడే విరమణ తేదీ ఖరారవుతుందని, అయితే, సర్వీసులో ఉన్నంత కాలం ప్రజలకు, రైతులకు మనం అందించిన సేవలే ఉద్యోగ విరమణ తర్వాత కూడా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు.

రాములు విద్యుత్ శాఖలో పనిచేసిన కాలంలో అందించిన సేవలు, చేసిన మంచి పనుల వల్లే ఈరోజు వర్షం పడుతున్నప్పటికీ వందలాది మంది రైతులు, ప్రజలు ఆత్మీయంగా తరలివచ్చారన్నారు. ఉద్యోగి సేవా కాలం ముగిసిన తర్వాత కూడా ప్రజలు వారిని గుర్తుపెట్టుకోవడమే అసలైన విజయమని మంత్రి తెలిపారు.

ప్రజా జీవితంలో ఉన్న నాయకులకైనా, ప్రభుత్వ ఉద్యోగులకైనా భగవంతుడు ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తాడని, ఆ అవకాశాన్ని సొంత లాభం కోసం కాకుండా, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించినప్పుడే జన్మకు సార్థకత లభిస్తుందని మంత్రి అన్నారు. రాములు ఉద్యోగానికి మాత్రమే రిటైర్మెంట్ ఇచ్చారు కానీ, సమాజ సేవకు కాదని, ఇప్పటివరకు పొందిన అనుభవంతో ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూ, ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసా చారి, ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button