
మహిళా న్యాయవాది దారుణ హ*త్య…
రంగారెడ్డి జిల్లాలో బుధవారం దారుణం జరిగింది. మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లిలో తన సోదరుడే కత్తితో స్వప్న మెడపై దాడి చేసి చంపిన ఘటన కలకలం రేపింది.
ఇది సుపారీ హత్య అని.. డబ్బులు ఇచ్చి కిరాయి హంతకులతో హత్య చేయించినట్లు వెల్లడైంది. ఇంతకీ లాయర్ స్వప్నను చంపించింది ఎవరో తెలుసా.. సొంత అన్న.. అవును.. మీరు విన్నది నిజమే..
సొంత అన్నయ్యనే.. చెల్లెలు అయిన లాయర్ స్వప్నను చంపించాడు.. కారణం ఏంటీ.. ఎందుకు ఇలా చేశాడు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం… లాయర్ స్వప్నను తన సొంత అన్ననే చంపించాడని అంటున్నారు గ్రామస్థులు.
ఆస్థి కోసం తనను ఇబ్బంది పెడుతుందని నెపంతో సుపారీ గ్యాంగ్ తో చంపించాడని అంటున్నారు గ్రామస్థులు.ఉదయం తన చెల్లెలు పొలానికి వెళ్లిన సమయంలో సుపారీ గ్యాంగ్ ముసుగులు ధరించి కారులో వచ్చారని.. స్వప్నను కత్తితో పొడిచి పారిపోయినట్లు తెలిపారు గ్రామస్థులు.
స్వప్నకు తన అన్నకు మూడేళ్ళ నుంచి ఆస్థి విషయంలో గొడవలు ఉన్నాయని.. గతంలో రెండుసార్లు స్వప్నను యాక్సిడెంట్ చేసి చంపాలని చూశాడని తెలిపింది స్వప్న తల్లి వెంకటమ్మ.
స్వప్న రెండుసార్లు యాక్సిడెంట్ నుంచి ప్రాణాలతో బయటపడిందని తెలిపింది. ఇవాళ ఉదయం సర్వే పని మీద స్వప్నతో కలిసి పొలం దగ్గరికి వెళ్లానని.. పొలం నుండి తిరిగి వస్తున్న సమయంలో దుండగులు వచ్చి చూస్తుండగానే.. స్వప్నను కర్రలతో కొట్టి కిందపడేసి.. కత్తితో పొడిచి చంపేశారని తెలిపింది.
స్వప్నను హత్య చేయించింది తన అన్ననే అని.. అతనిని క్షమించొద్దని.. అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని కోరుతోంది స్వప్న తల్లి. పోలీసుల నిర్లక్ష్యమే స్వప్న హత్యకు కారణమని అంటున్నారు లాయర్లు.
స్వప్న గతంలో రెండుసార్లు తన అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని..కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత పట్టించుకోలేదని అంటున్నారు లాయర్లు.
స్వప్న కంప్లైంట్ ఇచ్చిన సమయంలోనే తన అన్నపై యాక్షన్ తీసుకొని ఉంటే ఇవాళ స్వప్న హత్యకు గురయ్యేది కాదని అంటున్నారు.
పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు లాయర్లు. స్వప్నకు హత్యకు కారణమైన తన అన్నను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


