KhammamPoliticalTelangana

ఇల్లందులో రోడ్డు ప్రమాదం… స్పాట్ లోనే ఇద్దరు

ఇల్లందులో రోడ్డు ప్రమాదం… స్పాట్ లోనే ఇద్దరు

ఇల్లందులో రోడ్డు ప్రమాదం… స్పాట్ లోనే ఇద్దరు

Web desc : ఇల్లందు మండలంలోని సుదిమళ్ల స్టేజీ మెయిన్ రోడ్డు పై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

మండలంలోని కొల్లాపురం గ్రామానికి చెందిన పాయం సురేష్, పాయం ధనలక్ష్మి, పాయం సాకేత్, పాయం జయశ్రీ లు రెండు ద్విచక్ర వాహనాల పై ఓ వివాహ వేడుకకు వెళ్తున్నారు. సుదిమళ్ల స్టేజ్ దాటాక మెయిన్ రోడ్డు పై వారు ప్రయాణిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొని కింద పడ్డాడు.

అదే సమయంలో వెనక నుంచి వస్తున్న లారీ కింద పడి ఉన్న పాయం ధనలక్ష్మి (45), పాయం జయశ్రీ (13) లపై నుంచి వెళ్లడంతో ఇరువురు నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందారు.

పాయం సురేష్, పాయం సాకేత్ లకు తీవ్ర గాయాలు అయ్యాయి. పాయం సాకేత్ 2 కాళ్ళు నుజ్జు నుజ్జు కాగా, పాయం సురేష్ కాలుకు తీవ్ర గాయాలు అయ్యాయి.

కొత్తగూడెం వెళ్తున్న ఇల్లందు సీఐ తాటిపాముల సురేష్ ఘటనా స్థలంలో ఆగి 108 ద్వారా క్షతగాత్రులను ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, మెరుగైన వైద్యం కోసం ఖమ్మం రిఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button