
ఆలయం సమీపంలో మహిళ దారుణ హ*త్య
Web desc : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది.
ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోని ఓ గదిలో దాదాపు 35 నుంచి 38 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
హత్యకు గల కారణాల పై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి కేసునమోదు చేసి దుండగుల కోసం మేడ్చల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.




