
హార్ట్ స్టోక్స్ తో సీఐ మృతి…
Web desc : గిరిజన కుటుంబంలో జన్మించి.. కానిస్టేబుల్ గా ఉద్యోగ ప్రయాణాన్ని ప్రారంభించి అంచలంచలుగా ఎదుగుతూ సీఐ వరకు ఎదిగిన భూత్పూర్ మండలం సోమ్లా తాండాకు చెందిన పాత్లవత్ కిషన్ నాయక్ (60) సోమవారం గుండెపోటుతో మరణించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కానిస్టేబుల్ గా, హెడ్ కానిస్టేబుల్ గా, ఎస్ఐగా, సీఐగా విధులు నిర్వహించి గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ చార్మినార్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ లో సీఐగా బాధ్యతలు నిర్వహించారు.
సంవత్సర క్రితం నుంచి తీవ్ర అనారోగ్యంతో ఆయన వైద్య సేవలు పొందుతూ ఇంటికి పరిమితం అయ్యాడు. సోమవారం ఉదయం ఆకస్మికంగా గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయారు. కిషన్ నాయక్ కు భార్య, కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు.
కిషన్ నాయక్ మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బసవరాజ్ గౌడ్, మాజీ జడ్పీ చైర్మన్ చంద్రమౌళి, ఉమ్మడి జిల్లా మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడు మనే మోని సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్ ప్రేమ్ కుమార్ , బి ఆర్ ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, మేకల సత్యనారాయణ, అశోక్ గౌడ్, రాము నాయక్ చేరుకొని నివాళులు అర్పించారు.




