
‘నేనేమి చేయాలో కూడా నువ్వే చెప్తావా’.. మహిళా సిబ్బందితో అసభ్య ప్రవర్తన
Web desc : నేనేం చేయాలో అనేది కూడా నువ్వే చెప్తావా లేనిపోని తలనొప్పులు ఎందుకు తెచ్చుకుంటాం అంటూ దురుసుగా ప్రవర్తించాడని ఓ మహిళ నర్సింగ్ ఉద్యోగిని కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న నవీన అనే మహిళ నూతనంగా ఎయిమ్స్‌లో జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రధాన ఆసుపత్రి నుంచి ఎన్ఓసి కావాలని 25 రోజుల క్రితం సీనియర్ అసిస్టెంట్ కి దరఖాస్తు చేసుకుంది.
ఈ దరఖాస్తు పై ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని ఎన్ఓసి కోసం పలుమార్లు అతడిని అడిగిన దురుసుగా ప్రవర్తించేవాడని, నేనేమి చేయాలో నువ్వే చెప్తావా అయినా కొత్త జాబ్ కి అప్లై చేస్తూ కొత్త తలనొప్పులు ఎందుకు సృష్టిస్తున్నావు అంటూ నానా మాటలు అనేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
కనీసం నేను ఇచ్చిన దరఖాస్తు ఫారం అయిన నాది నాకు ఇవ్వండి అన్నా కూడా స్పందించకుండా తప్పించుకు తిరిగేవాడని ఆమె చెప్పుకొచ్చారు. ఈరోజు(సోమవారం) టప్పలో ఉన్న నా దరఖాస్తు ఫారమ్‌ను తీసుకోబోతుండగా అసభ్యంగా తాకాడని సదరు సీనియర్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని ఆమె కలెక్టర్‌కి వినతిపత్రం అందజేసింది.



