PoliticalTelangana

పోలీస్ స్టేషన్ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న ఇరువర్గాలు

పోలీస్ స్టేషన్ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న ఇరువర్గాలు

పోలీస్ స్టేషన్ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న ఇరువర్గాలు

Web desc : సదాశివపేట మండలం మద్దికుంట గ్రామానికి చెందిన తండా వాసులు ఒక కేసు నిమిత్తం సదాశివపేట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు కేసు విషయంలో రాజీ పడాలని సూచించినప్పటికీ, వారు వినకుండా బయటకు వచ్చారు.

అనంతరం పోలీస్ స్టేషన్ ముందే ఇరు వర్గాల కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు వారిని వెంటనే నియంత్రించలేకపోయారు.

ఈ ఘటనను చూసిన స్థానికులు, పోలీస్ స్టేషన్ ముందే ఇలాంటి ఘటనలు జరుగుతుంటే బయట పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసులను అడగగా, ఎలాంటి ఫిర్యాదు అందలేదని, కేసు నమోదు కాలేదని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button